AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖ 92 విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేయనుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.