AKP: నర్సీపట్నం టౌన్ సీఐగా గొల్లంగి గోవింద రావు నియమితులయ్యారు. ఈ మేరకు డీఐజీ గోపినాథ్ జెట్టీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గోవిందరావు విశాఖపట్నం కమిషనరేట్లో పని చేస్తున్నారు. గతంలో నర్సీపట్నం, కోట వురట్ల, రోలుగుంట, పరవాడ స్టేషన్లలో ఎస్సైగా, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేశారు.