కర్ణాటక సీఎం పదవిపై కేంద్రమంత్రి, జనతాదళ్ అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. 2028లో తాను మరోసారి సీఎం అవుతానని ప్రకటించారు. తాను ప్రవక్తను కాదని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ సర్కారు 2028 వరకు కొనసాగడం ఖాయం.. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తితో రాష్ట్ర ప్రభుత్వం పతనం కానుందని ఆరోపణలు చేశారు.