తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైనికులకు పిలుపునిచ్చారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను సందర్శించిన అనంతరం జిన్‌పింగ్ మాట్లాడుతూ.. సైనిక శిక్షణను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. తమ సైన్యం పోరాట, వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దీంతో మరోసారి చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.