ప్రస్తుతం గ్రూప్-1 కేటగిరీలో 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి. కానీ జీవో 29 ప్రకారం రిజర్వుడ్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. అదనంగా 3,233 అభ్యర్థులను ఎంపిక చేశారు. రిజర్వుడ్ కేటగిరీల వారు లేకపోవడమంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లేనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.