రైల్వే శాఖ NTPC-2024 అండర్ గ్రాడ్యూయేట్ స్థాయిలో 8,113 (గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్వైజర్-1736, టైపిస్ట్-1507,స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) పోస్టులను భర్తీ చేయనుంది. భర్తీకి సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఆర్ఆర్బీ వెబ్సైట్ను సంప్రదించండి.