రాజస్థాన్ థోల్పూర్లో నిన్న రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్‌కు చెందిన ట్రావెల్ బస్సు, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మృతిచెందిన వారిలో 8 మంది చిన్నారులు ఉండటంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.