BDK: దమ్మపేట మండలంలోని విలేకరులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇల్లందు పట్టణ కేంద్రంలో విలేకర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కథనాలు రాస్తున్న వారిపై కొంతమంది దాడికి పాల్పడుతున్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్సైకి తెలియజేశారు.