WNP: అమరచింత మండలం ధర్మపురం గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు శనివారం కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కే నాగరాజ్ గౌడ్ తెలిపారు. ధర్మపురం ప్రజలకు రోడ్డు లేదని గ్రామ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్లు మంజూరు చేసిందన్నారు. డిఈ ప్రవీణ్ కుమార్ ధర్మపురం రోడ్డును పరిశీలించారు.