బంగాళాఖాతంలో ఒక బలమైన వాయుగుండం ఏర్పడేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తమిళనాడుకు ఉత్తరంగా ఉంటుందని పేర్కొంది. దీంతో ఇవాళ రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అలాగే కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ రాత్రి ఉత్తర తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి రాయలసీమకు బలమైన గాలులు వీయనున్నాయి.