AP: అల్లూరి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడిపోయాయి. టైడా-చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు పడ్డాయి. దీంతో కొత్తవలస-కిరండల్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. రైలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.