AP: అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సభా ప్రాంగణానికి సీఎం చంద్రబాబు వస్తుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ వ్యక్తి కాళ్లు పట్టుకునేందుకు కొంచెం నడుము ఒంచారు. ఈ నేపథ్యంలో అతను కంగుతిన్నాడు. తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని, తన కాళ్లకు మొక్కితే తాను అలాగే చేస్తానని ఇటీవల చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.