SRCL : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకుని ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించి, స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు.