TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 27 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొననున్నారు. తొలిసారిగా ప్రశ్నాపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, పరీక్షా కేంద్రాలకు 100 మీటర్లలో జిరాక్స్, ఇంటర్ నెట్, దుకాణాలు మూసివేత. పరీక్షా కేంద్రాలకు 200 మీటరల్ల దూరం వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.