ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా 3 డ్రోన్లను ప్రయోగించింది. హమాస్ అధిపతి సిన్వర్ మృతికి ప్రతీకారంగా ఈ దాడి చేసింది. వాటిలో ఒకటి ఆ నివాసాన్ని తాకిందని, మరో రెండింటిని కూల్చేసినట్లు IDF తెలిపింది. ఘటన సమయంలో నివాసంలో నెతన్యాహు, ఆయన భార్య లేరని పేర్కొంది. మరోవైపు గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఉత్తర గాజాలో 50 మంది పౌరులు చనిపోయారు.