మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఈ నెల 31న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను దుల్కర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. రేపు సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.