కోనసీమ: అయినవిల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.