ఖమ్మం: నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న 55 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగరంలో నెంబర్ ప్లేట్ , రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 55 ద్విచక్ర వాహనదారులతో ఏసీపీ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.