JN: వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వడ్లకొండ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.