వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఈనెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక పేరును ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ పాల్గొంటున్నట్లు సమాచారం. వయనాడ్ కలెక్టరేట్‌కు రోడ్‌షో ద్వారా వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.