PLD: సీఎం కలలుగంటున్న పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను సాధించుకోవడంలో మహిళలే తొలిమెట్టు, వాళ్లే మార్పు సారథులు అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో మెప్మా బజార్‌ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.