TG: గ్రూప్ 1కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలతోనే పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లపైకి వచ్చి సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అలా కాకుండా ఆందోళన చేస్తే సహించమన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకే నిన్న అభ్యర్థులను అడ్డుకున్నామని స్పష్టం చేశారు.