NLG: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 8గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,08,912 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 1,08,912 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా అంతే స్థాయిలో నీరు నిల్వ ఉంది.