పెరుగు ఆరోగ్యానికే కాదు.. జుట్టుకీ మంచిదే అని నిపుణులు అంటున్నారు. పెరుగుతో హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే జుట్టు సమస్యలు దూరమవుతాయి. మినుముల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌లా చేసుకుని దానికి కాస్త పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. లేదా కప్పు పెరుగులో పావు కప్పు మెంతి పొడిని కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. వారానికి 2సార్లు చేస్తే జుట్టు మృదువుగా మారి, పట్టులా మెరుస్తుంది. వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా ఉంటాయి.