సంగారెడ్డి: పుల్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాధికారి శంకర్ హాజరై మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.