TG: మూసీని అడ్డుకుంటే రాజకీయ పార్టీలను చంపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. BRS రెచ్చగొడితే నల్లగొండ ప్రజలు రెచ్చిపోరు.. వారిది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. నల్లగొండ ప్రజలను అడిగితే మూసీ కష్టాలేంటో చెప్తారని, BRS ప్రభుత్వం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. కేబుల్ బ్రిడ్జ్ తప్ప HYDకు BRS ఏం చేసిందన్నారు. కేటీఆర్, హరీష్రావు నాయకులే కాదు.. కిషన్ రెడ్డి గురించి మాట్లాడటం దండగ అని ఎద్దేవా చేశారు.