దసరా సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఆఫర్లు తీసుకొచ్చిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో సేల్కు సిద్ధమైంది. తాజాగా ‘బిగ్ దీపావళి సేల్’ తేదీలను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా.. ఫ్లిప్కార్ట్ ప్లస్, VIP కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఈ విండో తెరుచుకోనుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటించింది.