TG: వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ వర్గీయులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వరంగల్‌లో కొండా సురేఖ, రావూరి ప్రకాశ్ రెడ్డి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.