TG: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఎక్కువ సమయం లభించలేదని ఆమె తెలిపారు. ఆయన వాటి గురించి తనతో వివరించలేదంటూ ఆవేదనకు గురయ్యారు. కాగా, సాయిబాబా శనివారం హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.