కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ మూవీ నుంచి దావూదీ అనే సాంగ్‌ను తొలగించడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. తాజాగా వారికీ గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ పాటను థియేట్రికల్ వెర్షన్లో ఇవాళ యాడ్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.