W.G: ప. గో. జిల్లా వ్యాప్తంగా ఈ-పంట నమోదు ప్రక్రియ 100% పూర్తయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు భీమవరంలో తెలిపారు. జిల్లాలో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా… వివిధ కారణాలతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 2,04,500 ఎకరాలకే పరిమితమైందన్నారు. ఈ-పంట నమోదు ఆధారంగా 1,08,000 మంది రైతులు 2, 04, 500 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు తెలిపారు.