TG: సీఎం రేవంత్ పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. HYD బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘కూల్చివేతలు ఆపాలని సీఎంకి విజ్ఞప్తి చేశాం. ప్రజల ఆవేదన పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించటం న్యాయం కాదు. గతంలో BRS మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గింది. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ చేయాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.