Bichagadu 2: ‘బిచ్చగాడు 2’ స్నీక్ పీక్ వీడియో రిలీజ్
'బిచ్చగాడు(Bichagadu)' సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా బిచ్చగాడు2 మూవీకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘బిచ్చగాడు(Bichagadu)’ సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమా పిచ్చైకారన్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో అటు కోలీవుడ్‌తో పాటుగా టాలీవుడ్‌లోనూ హీరో విజయ్ ఆంటోని(Vijay antony)కి అదిరిపోయే గుర్తింపు లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంటోని వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ను అందుకున్నారు. ఇకపోతే బిచ్చగాడు(Bichagadu) సినిమా తర్వాత విజయ్ ఆంటోని ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఆయన నటిస్తున్న బిచ్చగాడు2(Bichagadu2) సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ అంచనాలను పెంచుతూ ఈ మూవీకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ స్నీక్ పీక్ వీడియోలో సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల సన్నివేషాలను చూపించారు.
‘మనీ ఈజ్ ఇంజ్యూరియస్ టు ది వరల్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీని రూపొందించారు. చిత్ర యూనిట్ ఈ సినిమా స్నీక్ పీక్ వీడియోను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ స్నీక్ పీక్ వీడియోలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ గురించిన చర్చ కూడా ఉంది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమాలో సరికొత్త అంశాన్ని విజయ్ ఆంటోని(Vijay antony) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
విజయ్ ఆంటోని(Vijay antony) ఈ మూవీ షూటింగ్ కోసం మలేషియా వెళ్లగా ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత మెల్లగా కోలుకుని చెన్నైకు వచ్చారు. ఈ మధ్యనే ఆయన దవడకు కూడా ఆపరేషన్ జరిగినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆయన సినిమా ఆగిపోతుందని అందరూ అనుకున్న తరుణంలో ఇలా స్నీక్ పీక్ వీడియోతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. దీంతో ‘బిచ్చగాడు2′(Bichagadu2) సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.