ASR: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ ఉప సర్పంచి మడపల సోమేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఊబపొలం గ్రామంలో గ్రామస్థులు, అంగన్వాడీ కార్యకర్త సత్యవేణి, ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ, స్థానిక పెద్దలు రాజారావు, బాలరాజుతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు.