SKLM: శ్రీకాకుళం పట్టణంలో బుధవారం ఆఖరి రోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో స్వచ్ఛతా హీ సేవా అవార్డులను ప్రధానం చేశారు. నగరంలో సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు.