NLG: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చోల్లేడు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మునుగోడుకు చెందిన రేవల్లి నాగరాజు, మర్రిగూడ మండలం నర్సిరెడ్డి గూడెంకి చెందిన కీలకత్తి ఆంజనేయులు మృతి చెందారు. మరో వ్యక్తి బొమ్మనగోని నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.