వేడుకల్లో డీజే సౌండ్స్ ఈసారి శృతిమించాయని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హృద్రోగులు, వయసు పైబడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబీలోనూ.. పబ్బుల్లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని కట్టడి చేయాలంటూ పలు సంఘాల నుంచి వినతులు అందాయని.. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.