SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు ఐజే నాయుడు కాలనీలో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం ‘అనే కార్యక్రమం లో భాగంగా సభ నిర్వహించారు. స్థానిక వార్డు యూత్ నాయకులు కూన రాము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వార్డు పరిధిలో గత 100 రోజుల కూటమి పరిపాలన వలన మంజూరు అయిన వివిధ సామాజిక పెన్షన్లు, సీఎం సహాయనిధి వివరాలు, తదితరు వాటిని వివరించారు.