ASR: మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని కుడుముసారి పంచాయతీ కోటగున్నలు, నిమ్మపాడు, కోరుకొండ గ్రామాల్లో ఆయన పర్యటించారు. లోతుగెడ్డ వంతెన నుంచి బలపం, కోరుకొండ వరకు రహదారి నిర్మాణం, కొండపైనున్న గ్రామాలకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడతామన్నారు.