TG: హైడ్రాకు 169 మంది అధికారులను డిప్యూటేషన్‌పై కేటాయిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించింది. అలాగే, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను హైడ్రాకు డిప్యూటేషన్‌పై సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.