NLG: ఈ సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టం మిల్లింగ్ రైస్ పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ ఇప్పటి వరకు 90% పూర్తయిందని, తక్కిన 10% ఈ వారం రోజులలో పూర్తిచేయాలని, పూర్తిచేయని వారిని డిఫాల్టర్లగా గుర్తిస్తామన్నారు.