ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీలు, రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర సీఎం ఖండించారు. రాష్ట్ర జనాభాలో ఎటువంటి మార్పు లేదని సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. ప్రజల్లో విద్వేషాలకు బీజేపీ బీజం వేస్తోందని సాహిబ్‌గంజ్‌లో నిర్వహించిన సభలో విమర్శలు చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కొంతమంది జార్ఖండ్ నేతలను కొనుగోలు చేసిందని ఆరోపించారు.