AP: వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైసీపీని వీడనున్నారు. త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయవర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. కొంతకాలంగా బొత్స సత్యనారాయణ వైఖరిపై లక్ష్మణరావు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో బొత్స విజయం కోసం లక్ష్మణరావు పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది.