భారీ వర్షపాతం సహారా ఎడారిలో వృక్ష సంపదకు దారి తీసింది. సెప్టెంబర్ 7,8వ తేదీల్లో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను ఉష్ణమండల తుఫాను ముంచెత్తింది. దీంతో ఎడారిలో ముక్కలు ఉద్భవిస్తున్నాయి. అలాగే అరుదుగా వర్షం కురిసే దేశాలైన మొరాకో, అల్జీరియా, లిబియాలోనూ పచ్చదనం సంతరించుకుంది. నదీగర్భాల వంటి లోతట్టు ప్రాంతాల్లో పొదలు, చెట్లు పెరుగుతున్నాయని నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.