AP: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం కేసులో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రథం ఉన్న షెడ్డు గేటు తాళాన్ని ఆక్సాబ్లేడుతో కోసి.. నిప్పు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. అయితే ఈశ్వర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్తగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.