ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అతడు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. దుబాయి లేదా అమెరికా వెళ్లినట్లు సమాచారం. కాగా పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్బాస్ OTT కంటెస్టెంట్ హర్షసాయిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు.