ELR: తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ వార్తల నేపథ్యంలో నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా నరసాపురానికి చెందిన జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ(చిన్నా) నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం శివాలయంలో ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.