TG: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చేందుకు సీఎం నివాసానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దంపతులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ మంత్రి సీతక్కను చూడగానే మహేశ్ సతీమణి, నటి నమ్రత ఆమె దగ్గరకు వెళ్లారు. మంత్రికి ఫ్యాన్‌ని అంటూ సీతక్కతో నమ్రత ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.