TG: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్నెస్పీ కాలువకు గండిపడన ప్రాంతాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయాక నీరు అందిస్తారా అంటూ మండిపడ్డారు. సకాలంలో నీరు అందించకపోవడానికి కారకులైన అధికారులపై రిపోర్టు తయారు చేయలని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.