అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్లు అయ్యిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ 2 తనకు హోమ్ బ్యానర్ అని చెప్పారు. ఇంతవరకు బ్యానర్లో సినిమా చేయలేదని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ మూవీ చేసిన తర్వాత అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ రోజు వరకు సినిమా ఎప్పుడూ అని అడగలేదన్నారు. గుర్తు చేస్తే మంచి సినిమా అనుకున్నప్పుడు చేద్దాం అంటున్నారు. సినిమా ఫంక్షన్‌కు వచ్చిన సమయంలో మాట్లాడతారని ఆశగా ఎదురుచూస్తుంటానని చెప్పారు. కానీ తన సినిమా గురించి కాకుండా.. ఫంక్షన్‌కు వచ్చిన మూవీ గురించి మాత్రమే మాట్లాడుతారని నవ్వేశారు.
బాలయ్య అన్ స్టాపబుల్-2 షోలో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి చర్చ వచ్చింది. తొలి ప్రేమ హిట్ అయిన తర్వాత కొంచెం అమౌంట్ ఇచ్చారని తెలిపారు. గబ్బర్ సింగ్ మూవీని బండ్ల గణేశ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు తాను అనుకున్నంత కాదని.. నిర్మాత అనుకున్నంత ఇచ్చారని పవన్ చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్‌ను ట్రోల్ చేశారు. దీనికి బండ్ల గణేశ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు పదేళ్ల కింద తనకు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ ఇంకా తన సినిమాను పట్టాలు ఎక్కించడం లేదని హరీశ్ శంకర్ అంటున్నారు.